నెల్లూరు నగరంలో కరోనా విజృంభిస్తుండడంతో లాక్ డౌన్ నిబంధనలను అధికారులు పొడిగించారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 15వ తేదీ వరకు నగరంలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే 8వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉండగా, దానిని మరోసారి పొడిగించారు.
నెల్లూరులో లాక్ డౌన్ పొడిగింపు - నెల్లూరులో కరోనా విజృంభణ
నెల్లూరు నగరంలో లాక్ డౌన్ ను పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల తొమ్మిది నుంచి 15 వరకు నగరంలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
నెల్లూరులో లాక్ డౌన్ పొడిగింపు
ఉదయం ఆరు నుంచి ఒంటి గంట వరకు నిత్యావసర దుకాణాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. లాక్ డౌన్ కు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని చెప్పారు. కరోనా తీవ్రత అధికమవుతుండటంతో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: 'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా'