కరోనా కారణంగా నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. పోలీసులు నగరాన్ని దిగ్బంధించిన కారణంగా రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలెవ్వరిని రోడ్లపై తిరగనివ్వటంలేదు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. దుకాణాలు మూతపడ్డాయి. నిత్యావసర వస్తువుల కొనుగోలు చేసేందుకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకే అనుమతిస్తున్నారు. వైద్యురాలు యశోధర.. ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు ఆహార పొట్లాలను అందజేశాయి. జిల్లాలోని ఉదయగిరిలోనూ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సహకారంతో ఉదయగిరి పట్టణంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించాయి.
నెల్లూరులో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుపరుస్తున్న పోలీసులు
కరోనా ప్రభావంతో నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావటం లేదు. ఉదయగిరి పట్టణంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించాయి. పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు ఆహారాన్ని అందించాయి.
నెల్లూరు జిల్లాలో లాక్డౌన్