నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మసీదు ప్రారంభోత్సవాన్ని గ్రామానికి చెందిన కొందరు అడ్డుకున్నారు. మసీదులో నమాజు చేయకుండా తాళాలు వేసి అడ్డుకున్నారని ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. మసీదును వాడేందుకు వీలు లేదని.. పక్కనే దేవాలయం ఉందని స్థానికులంటున్నారని బాధితులు వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
పొంగూరులో ఉద్రిక్తత.. మసీదు ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న స్థానికులు - పొంగూరులో మసీదు ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న స్థానికులు
దేవాలయం పక్కనే నమాజ్ చేయటానికి వీలులేదని స్థానికులు మసీద్‌కు తాళాలు వేసిన ఘటన.. నెల్లూరు జిల్లా మర్రిపాడులోని పొంగూరు గ్రామంలో జరిగింది. పొంగూరులో మసీదు ప్రారంభోత్సవాన్ని కొందరు స్థానికులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది.

పొంగూరులో ఉద్రిక్తత.. మసీదు ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న స్థానికులు