ప్రజాప్రతినిధులు, వారి బంధువులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు కల్పించకుండా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెదేపా చేసిన కాలయాపన కారణంగా రాష్ట్రానికి 14వ ఆర్ధిక సంఘం నుంచి రావలసిన 5వేల కోట్ల నిధులు నిలిచిపోయాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్లలో ఎంపీపీ పదవి కోసం వైకాపా అభ్యర్థిని కిడ్నాప్ చేసి పదవిని దక్కించుకున్న సంఘటనలు తెదేపా నాయకులకు గుర్తు లేదా అని సూటిగా ప్రశ్నించారు. తెదేపా గత పాలనలో వైకాపా నుంచి 21 మంది ఎమ్మెల్యేలను లాక్కుని వారిలో నలుగురికి మంత్రి పదవి కట్టబెట్టడం ప్రజాస్వామ్యమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల విషయంలో తెదేపా నాయకులకు వైకాపా అడ్డుపడుతోందనడం సబబు కాదని హెచ్చరించారు.
'ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం ప్రశంసనీయం' - narasaraopet mla
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులకు, వారి బంధువులకు చోటు కల్పించకుండా తీసుకున్న నిర్ణయాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన తెదేపా తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
నరసరావుపేటలో తెదేపా తీరుపై స్థానిక ఎమ్మెల్యే సమావేశం
ఇదీచదవండి.