Bomb Blast In Nellore District: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరులో నాటుబాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురికి గాయలయ్యాయి. బాంబు పేలుడులో దంపతులు వెంకటేశ్వర్లు, కృష్ణమ్మకు తీవ్ర గాయాలుకాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాంబు పేలినపుడు భారీ శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. అడవిపందుల వేట కోసం నాటు బాంబులు చుడుతుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని నెల్లూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మడమనూరులో పేలిన నాటుబాంబు... నలుగురికి గాయాలు - నెల్లూరు జిల్లా వార్తలు
Bomb Blast In Nellore District: అడవిపందుల వేట కోసం నాటు బాంబులు చుడుతుండగా పేలిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
blast