నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం అయ్యపరెడ్డిపాళెం వద్ద మద్యం దుకాణాలు తెరుచుకోవటంతో....జనాలు బారులు తీరారు. రోడ్డు పొడవునా నిలబడి బౌతిక దూరం పాటించలేదు. పోలీసులు లాఠీలకు పని చెప్పినా ఫలితం లేకపోయింది. కొంతసేపు దుకాణం మూసేశారు. ఒక దశలో తొక్కిసలాటలు జరిగాయి.
ఎక్సైజ్ సీఐ, స్థానిక ఎస్సైలు సిబ్బందితో కట్టడి చేయలేకపోవటంతో.... గందరగోళం నెలకొంది. పోలీసులు లాక్ డౌన్ అమలు చేయక మద్యం దుకాణాల వద్ద సిబ్బందితో నియంత్రించాల్సి వచ్చింది. దుకాణాలు తెరవడంతో కరోనా వైరస్ అందరికీ పాకే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.