సుదీర్ఘ విరామం తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే మద్యం దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో మందు కొనేందుకు మద్యం ప్రియులు అవస్థలు పడుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 షాపులు ఉండగా.... 9 షాపుల్లో మద్యం అమ్మకాలకు అధికారులు అనుమతించారు. ఈ షాపుల వద్ద కిలోమీటర్ల మేర మందుబాబులు బారులు తీరారు. బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు మండలాల్లో మద్యం దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో... వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టమౌతోంది. బుచ్చిలో భౌతిక దూరం పాటించకపోవడంతో మందు బాబులను పోలీసులు చెదరగొట్టారు. ఫలితంగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మండుటెండలో తమ చెప్పులను వరుస క్రమంలో పెట్టి మరి వేచి ఉంటున్నారు మందుబాబులు. కొన్ని చోట్ల సామాజిక దూరం పాటిస్తుండగా, మరికొన్ని చోట్ల నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.
కిక్ కోసం కిలో మీటర్లు మేర క్యూ...!
నెలన్నర తర్వాత మద్యం దుకాణాలు తెరవడంతో మందుబాబుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. కరోనా కలవరపెడుతున్నా...మందుబాబులు మాత్రం మద్యం దుకాణాలు ముందు బారులుతీరారు. నెల్లూరు జిల్లా కోవూరులో నిబంధనలు మరిచి మరీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
నెల్లూరు మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు