ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కిక్ కోసం క్యూ కట్టారు...నిబంధనలు మరిచారు..! - మద్యం వార్తలు

నెల్లూరు జిల్లాలో మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియులు బారులుతీరారు. 40రోజుల తర్వాత దుకాణాలు తీయడంతో వందలాది మంది కొనుగోలుకు మండుడెండల్లో నిలిచారు. భౌతిక దూరం పాటించలేదు. మాస్కులు లేకుండానే కొనుగోలు చేస్తున్నారు.

liquor-shops-opened-in-nellore
నెల్లూరులో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు

By

Published : May 4, 2020, 6:03 PM IST

లాక్ డౌన్ సమయంలో మందు లేక అల్లాడుతున్న మందుబాబులకు కేంద్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరుచుకోమని చెప్పడంతో కొంత ఊరట లభించింది. రాష్ట్రం ప్రభుత్వం మద్యం రేట్లను పెంచిన కూడా... భౌతికదూరం పాటించకుండా...మండుటెండలో మందుబాబులు బారులు తీరారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గంలో పలు మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో...కరోనా సోకుతుందేమోనన్న భయం లేకుండా క్యూ కట్టారు. చిల్లకూరు, విందూరు, చెన్నూరు గ్రామాల్లో మద్యం దుకాణాలు తెరవక ముందు నుంచే మద్యంప్రియులు పడిగాపులు కాస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details