ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీళ్లు వదిలారు... అడిగితే తెలియదంటున్నారు! - నెల్లూరు సోమశిల జలశయ వార్తలు

నెల్లూరు జిల్లా సోమశిల జలశయంలో ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు 11వ నెంబరు క్రస్ట్‌ గేట్‌ను ఎత్తి ఒక్కసారిగా పెన్నానదిలోకి నీటిని వదిలేశారు. ఘటనపై అధికారులను ప్రశ్నించగా తాము గేట్లు ఎత్తలేదని మాట దాటేశారు.

సోమశిల జలశయంలో గేట్లు ఎత్తివేత
సోమశిల జలశయంలో గేట్లు ఎత్తివేత

By

Published : May 14, 2020, 8:47 AM IST

నెల్లూరు జిల్లాకు తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తున్న సోమశిల జలాశయంలో నీరు మాయమవుతోంది. భానుడు నిప్పులు కురిపిస్తున్న వేళ ఎక్కడ చుక్క చినుకు పడకున్నా అర్ధరాత్రి పెన్నా నదిలో వరద అమాంతంగా పెరిగి ప్రవహిస్తోంది. సోమశిల జలాశయంలో ఆదివారం అర్ధరాత్రి సుమారు 20 వేల క్యూసెక్కుల నీరు విడుదలైంది.

ఈ కారణంగా.. ఉప్పలపాడు వద్ద జరుగుతున్నవంతెన నిర్మాణ పనులకు అంతరాయం కలిగింది. యంత్రాలు, ఐరన్ మెటీరియల్ నీటిలో మునిగిపోయాయి. అక్కడ పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది ప్రవాహంలో కొట్టుకుపోగా.. గమనించిన కూలీలు వారిని కాపాడారు.

లోతట్టు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లేవారి తెప్పలు, వలలు ప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయి. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎత్తడం ఏమిటని ప్రశ్నించగా.. తాము గేట్లు ఎత్తలేదంటూ అధికారులు మాట దాటవేశారు.

ఇవీ చదవండి:

రెండో పంటకు సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల

ABOUT THE AUTHOR

...view details