leadership war continues among the YSRCP: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీలో రోజురోజుకీ వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి మధ్య వివాదం ముదిరిపాకానపడుతోంది. తాజాగా నియోజకవర్గంలోని ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు ప్రాంతాల్లో నూతన సంవత్సరం సందర్భంగా చేజర్ల సుబ్బారెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. దీంతో చేజర్ల సుబ్బారెడ్డి ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ ఘటనపై ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇందుకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని కోరుతూ దుత్తలూరులోని 565 జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఫ్లెక్సీలు చించడంతో మరోసారి.. వైసీపీలో వర్గ విభేదాలు..! - వైకాపా విభేదాలపై వార్తలు
YSRCP leaders in Udayagiri constituency: కొత్త సంవత్సర వేడుకల సన్నాహాల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి మధ్య విభేదాలు ముదురుతున్నాయి. చేజర్ల సుబ్బారెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇది ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి వర్గీయుల పనేనని.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్వంత పార్టీ నేతలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
![ఫ్లెక్సీలు చించడంతో మరోసారి.. వైసీపీలో వర్గ విభేదాలు..! Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17362032-696-17362032-1672489824920.jpg)
ఈ పరిమాణాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నియోజకవర్గంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీలో అంతర్గత విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలోని కొందరు నేతలు రెండు, మూడు వర్గాలుగా విడిపోయారు. ఈ వర్గాలను కలిపి ఏకతాటిపైకి తీసుకురావాలని నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయ రెడ్డి ఇటీవల మండలాల్లో పర్యటించారు. ధనుంజయ రెడ్డి వరికుంటపాడులో పర్యటించే సమయంలో ఆయన సమక్షంలోనే రెండు వర్గాలుగా విడిపోయిన వైసీపీ నేతలు ఢీ అంటే ఢీ అని ఘర్షణకుదిగారు. ఈ పరిణామాలు జిల్లా నేతలకు తలనొప్పిగా మారాయి. వచ్చే ఎన్నికలకు ఉదయగిరి టికెట్‌కు సుబ్బారెడ్డి కూడా పోటీపడుతున్నారు.