'మత్స్యకారులకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం' - మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు బెస్త న్యూస్
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ఫిషింగ్ యార్డుల్లో చేపలు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లను అఖిల భారత గంగపుత్ర మహాసభ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు బెస్త ప్రకటించారు.
!['మత్స్యకారులకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం' Leaders of the All India Gangaputra Mahasabha visited the states of Tamil Nadu and Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10998780-314-10998780-1615666500752.jpg)
అఖిల భారత గంగపుత్ర మహాసభ నేతలు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి.. అక్కడి ఫిషింగ్ యార్డుల్లో చేపలు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించారు. ఈ సందర్భంగా చేపల నిల్వ ఉంచే పద్ధతులు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే విధానాలను అక్కడి సిబ్బందిని అడిగి.. మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు బెస్త తెలుసుకున్నారు. ఆంధ్రాలో మత్స్యకారులకు జగన్ సర్కార్ అందిస్తున్న పథకాల గురించి వారికి తెలియజేశారు. మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గంగపుత్రులకు ప్రత్యేక పథకాల రూపకల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటామని వెంకటేశ్వర్లు బెస్త అన్నారు. మత్స్యకారులకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.