ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో న్యాయవాదులు ఆందోళన - lawyers protest at nellore latest newws

మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... నెల్లూరులో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

lawyers protest at nellore
నెల్లూరులో న్యాయవాదులు ఆందోళన

By

Published : Jan 2, 2020, 5:14 PM IST

మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... నెల్లూరులో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. నగరంలోని జిల్లా కోర్టు ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మూడు రాజధానుల ఏర్పాటు అభివృద్ధి వికేంద్రీకరణ కాదని, అది రాజకీయ స్వార్థమని దుయ్యబట్టారు. 75రోజులుగా తాము నిరసన తెలియజేస్తుంటే మంత్రులు హేళనగా మాట్లాడటం దారుణమన్నారు. రాజధానితోపాటు... హైకోర్టు అమరావతిలో ఉంటేనే అందరికీ సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినా... నెల్లూరును మాత్రం అందులో కలపోద్దని కోరారు.

నెల్లూరులో న్యాయవాదులు ఆందోళన

ABOUT THE AUTHOR

...view details