ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటవీ శాఖకు ఇచ్చేందుకు భూములను పరిశీలించిన అధికారులు - ఉదయగిరి భూముల వార్తలు

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రోడ్డు నిర్మాణానికి వినియోగించిన అటవీ భూమికి ప్రత్యామ్నయంగా మరోచోట భూమిని కేటాయించారు. ఆ స్థలాన్ని స్థానిక ఆర్డీవో సువర్ణమ్మ.. తహసీల్దార్ పరిశీలించారు. జిల్లా పాలనాధికారి అనుమతి వచ్చాక భూములను అటవీ శాఖకు అప్పగిస్తామని స్పష్టం చేశారు.

lands give to forest department
పరిశీలించిన అధికారులు

By

Published : Feb 25, 2021, 1:12 PM IST

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లి ఘాట్ రోడ్డు, వెంకటాచలం మండలకేంద్రం రోడ్డు నిర్మాణానికి అధికారులు అటవీ భూమిని కేటాయించారు. అందుకు ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదయగిరి మండలం కొండాయపాలెం రెవెన్యూ గ్రామంలో గుర్తించిన భూములను ఆత్మకూర్ ఆర్డీవో సువర్ణమ్మ.. స్థానిక తహసీల్దార్ హరనాథ్​తో కలిసి పరిశీలించారు. ప్రత్యామ్నాయ భూముల హద్దుల సర్వేయర్ వివరాలు సేకరించారు.

కొండాయపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 1261, 1262లో 11.47ఎకరాల రెవెన్యూ భూమిని గుర్తించామన్నారు. నివేదికలను జిల్లా పాలనాధికారికి పంపిస్తామని తెలిపారు. అనుమతి వచ్చిన వెంటనే భూమిని అటవీ శాఖకు అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు. తహసిల్దార్ కార్యాలయంలో భూముల రీసర్వే, నీటి పన్ను వసూలు తదితర విషయాలపై వీఆర్వోలతో సమీక్షించారు.
ఇదీ చదవండి:మర్రిపాడులో ఎస్​ఈబీ సోదాలు.. 3 ఇసుక లారీలు సీజ్

ABOUT THE AUTHOR

...view details