ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెచ్చిపోయిన కబ్జాదారులు... రాత్రికి రాత్రే శ్మశానం ఆక్రమణ - మర్రిపాడు వార్తలు

ప్రజలు కోరనాతో అల్లాడుతుంటే.. కొందరు భూ కబ్జాదారులు మాత్రం రెచ్చిపోతున్నారు. నెల్లూరు జిల్లాలో కొందరు రాత్రికి రాత్రే ముస్లింల శ్మశాన వాటికను ఆక్రమించారు. విషయం తెలుసుకున్న ముస్లింలు వారిపై అధికారులకు ఫిర్యాదు చేశారు.

Land grabbers occupying a Muslim cemetery in nellore district
రెచ్చిపోయిన కబ్జాదారులు... రాత్రికి రాత్రే శ్మశానం ఆక్రమణ

By

Published : May 24, 2021, 1:41 PM IST

రెచ్చిపోయిన కబ్జాదారులు... రాత్రికి రాత్రే శ్మశానం ఆక్రమణ

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారితో ప్రజలు అల్లాడుతుంటే.. కబ్జాకోరులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడులో కొందరు భూ కబ్జాదారులు ముస్లింల శ్మశాన వాటికను రాత్రికి రాత్రే కబ్జా చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామంలోని ముస్లింలు.. ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేశారు. శ్మశాన వాటికను ఆక్రమించిన వారిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. శ్మశాన వాటికకు రక్షణ కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details