రాపూరు మండలం పెంచలకోన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం స్వామివారికి బంగారు హనుమంతు సేవ నిర్వహించారు. సేవలకు ముందు స్వామివారికి స్నపన తిరుమంజన పూజలు జరిపారు. ఏకాంత సేవలుగా జరిగే ఈ ఉత్సవాల్లో.. అర్చకుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
పెంచలకోనలో కన్నులపండువగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు - today Lakshmi Narasimhaswamy Brahmotsavalu news update
నెల్లూరు జిల్లా పెంచలకోనలో లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారికి బంగారు హనుమంతు సేవ నిర్వహించారు.

కన్నులపండువగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు