నెల్లూరులో అక్రమంగా గుట్కా వ్యాపారం చేస్తున్న ఇద్దరిని నవాబుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10.72 లక్షల రూపాయల విలువైన గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి రొయ్యల వాహనాల్లో గుట్కాలను అక్రమంగా నెల్లూరు తరలిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఆ పాడుపడ్డ కోళ్లఫారమే గుట్కా వ్యాపారానికి అడ్డా - నెల్లూరు క్రైమ్ న్యూస్
బెంగళూరు నుంచి నెల్లూరుకు నిషేధిత గుట్కా, ఖైనీలను ఇద్దరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. నెల్లూరులోని ఓ పాడుపడిన కోళ్లఫారాన్ని అడ్డాగా చేసుకుని అక్రమ వ్యాపారం చేస్తున్నారు. గుట్కా అమ్మకాలపై నిఘా పెట్టిన నెల్లూరు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని సుమారు పదకొండు లక్షల గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆ పాడుపడ్డ కోళ్లఫారమే గుట్కా వ్యాపారానికి అడ్డా
నెల్లూరులోని ప్రశాంత్ నగర్ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న కోళ్లఫారంలో ఈ గుట్కాను నిల్వ చేసి, దుకాణదారులకు విక్రయిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. నిషేధిత గుట్కాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి :జీవో 203తో విద్వేషాలు పెంచుతున్నారు: చంద్రబాబు