ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కబ్జా కోరల్లో శ్మశానం మార్గం... అంత్యక్రియలకు అవస్థలు - నెల్లూరు జిల్లా వార్తలు

ఆ గ్రామంలో ఎవరైనా మరణిస్తే.. ఆ వ్యక్తి మరణించిన దుఃఖం కంటే అంత్యక్రియలు ఎలా చేయాలన్న ఆవేదనే వారి ఆత్మీయులను ఎక్కువగా బాధిస్తోంది. ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేసేందుకు శ్మశానానికి వెళ్లాలంటే.. దారిలేక ముళ్లపొదలు, పొలాల మధ్యలో పాడెను మోసుకెళ్లాల్సి వస్తోంది. ఇది నెల్లూరు జిల్లాలోని కడగుంట గ్రామస్థులు ఆవేదన.

lack of road facility in burial ground in kadagunta
కబ్జా కోరల్లో శ్మశానం దారి

By

Published : Dec 4, 2020, 10:38 AM IST

కబ్జా కోరల్లో శ్మశానం దారి

పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. మరణించిన వారి అంతిమ సంస్కారాలకు ఆరడుగుల స్థలం అవసరం. ఆ స్థలం ఉన్నా కూడా.. అక్కడికి వెళ్లేందుకు మార్గం సరిగా లేకుంటే.. చనిపోయిన వారి కుటుంబీకుల ఆవేదన రెట్టింపు కావడం ఖాయం. నెల్లూరు జిల్లా బాలయపల్లి మండలం కడగుంట గ్రామస్తులది ప్రస్తుతం ఇదే పరిస్థితి.

గ్రామంలో గురువారం ఓ వివాహిత మృతి చెందింది. దహన సంస్కారాల నిమిత్తం శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు కుటుంబీకులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో ఉన్న శ్మశాన స్థలం దారి ఆక్రమణకు గురైంది. అందులోనూ ఇప్పుడు వర్షాలు. దారులు లేక పొలాల మధ్యలో పాడెను మోసుకెళ్తూ... గ్రామస్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. పలుమార్లు రెవిన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details