ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PROTEST AT ANANDAIAH HOUSE : ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థుల ఆందోళన - krishnapatnam anandaiah

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో.. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇంటి వద్ద గ్రామస్థులు నిరసన చేశారు. ఒమిక్రాన్ మందు శాస్త్రీయతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థుల ఆందోళన
ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థుల ఆందోళన

By

Published : Dec 27, 2021, 6:48 PM IST

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో.. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇంటి వద్ద గ్రామస్థులు నిరసన చేశారు. ఒమిక్రాన్​కు మందు తయారీ ప్రకటనపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ మందు శాస్త్రీయతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒమిక్రాన్ మందుపై అనందయ్య ప్రకటనతో అనేకమంది వ్యాధిగ్రస్థులు గ్రామానికి వస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

పూర్తి స్థాయిలో నివేదికలు లేకుండా ముందు తయారు చేసినట్లు ప్రకటించడం సరికాదని ఉప సర్పంచ్ అభ్యంతరం తెలిపారు. వివిధ రకాల వ్యాధిగ్రస్థులు గ్రామంలోకి వస్తుండటంతో తమకూ వ్యాధులు సంక్రమిస్తాయనే ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆనందయ్య.. కోర్టు నుంచి నివేదిక రాగానే వివరణ ఇస్తానని తెలిపారు.

ఇదీచదవండి :

Saree to Fit in Matchbox: అగ్గిపెట్టెలో ఇమిడిపోయే.. బంగారు చీర నేసిన నేతన్న!

ABOUT THE AUTHOR

...view details