ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆనందయ్య ఆయుర్వేద మందుతో.. మార్మోగుతున్న కృష్ణపట్నం పేరు! - నెల్లూరు ఆనందయ్య వార్తలు

ఆనందయ్య ఆయుర్వేద మందు రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కృష్ణపట్నం పేరు మార్మోగుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి మాత్రమే కాక ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా వస్తుండడంతో రోడ్లు రద్దీగా మారాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించాల్సి వస్తోంది.

krishnapatnam
krishnapatnam

By

Published : May 29, 2021, 4:07 PM IST

ఆనందయ్య ఆయుర్వేద మందు వల్ల నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పేరు ప్రతి ఒక్కరికీ సుపరిచితమైంది. ఆనందయ్య ఔషధం కోసం ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా వస్తుండడంతో వాహనాలతో రోడ్లు రద్దీగా మారాయి. నివేదిక వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించినా ప్రజలు వస్తూనే ఉన్నారు.

రద్దీగా రహదారులు..

నెల్లూరు - ముత్తుకూరు - కృష్ణపట్నం రోడ్డు వాహనాలతో కిక్కిరిసిపోయింది. మందు పంపిణీ ఈ నెల 21న నిలిపివేశారని తెలిసినా ప్రజలు వాహనాల్లో వస్తునే ఉన్నారు. పోలీసులు రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. కృష్ణపట్నం గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆనందయ్య కోసం వస్తున్న వారికి అనుమతి నిరాకరిస్తున్నారు.

ఇదీ చదవండి:

రహస్య ప్రాంతానికి ఆనందయ్య.. మందుపై నివేదికలు వచ్చేవరకు అంతేనా?

ABOUT THE AUTHOR

...view details