నెల్లూరు జిల్లా ముత్తుకూరులో కృష్ణపట్నం పోర్టు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యాజమాన్యం వేతనాలు సక్రమంగా చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుందని ఆందోళన చేశారు. ముత్తుకూరు రోడ్డులో వాహనాలను అడ్డుకున్నారు. కొందరు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తొలగిస్తున్నారని విమర్శించారు. ఈ విధానం మార్చుకోకుంటే ఉద్యమాన్ని తీవ్ర రూపంలోకి తీసుకుపోతామని కార్మికులు హెచ్చరించారు.
ఉద్యోగ భద్రత కల్పించండి: కృష్ణపట్నం పోర్టు కార్మికులు - కృష్ణపట్నం పోర్టు కార్మికులపై వార్తలు
ఉద్యోగ భద్రత కల్పించాలని కృష్ణపట్నం పోర్టు కార్మికులు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో నిరసన చేపట్టారు. కొందరు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తొలగిస్తున్నారని విమర్శించారు.
కృష్ణపట్నం పోర్టు కార్మికుల నిరసన
నిరసన తెలుపుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. చలో కృష్ణపట్నం పోర్టు కార్యక్రమాన్ని నిలిపివేశారు.
ఇదీ చదవండి: టోల్గేట్ వద్ద మాజీ ఎంపీ వీరంగం.. పోలీసులపై దాడి!