ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kotamreddy Sridhar Reddy: అభివృద్ది పనులు 15 రోజుల్లోగా ప్రారంభించాలి.. లేకుంటే!

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ అభివృద్ధి పనులకు 15 రోజుల్లోగా ప్రారంభించాలని.. లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Kotamreddy Sridhar Reddy
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

By

Published : Apr 16, 2023, 2:11 PM IST

Kotamreddy Sridhar Reddy: నెల్లూరులో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ అభివృద్ధి పనులకు 15 రోజుల్లోగా ప్రారంభించాలని లేకుంటే మరో ఉద్యమం తప్పదని.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఆరు నెలల క్రితం టెండర్లు పిలిచినా నిధులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పనులు పూర్తి అయితే నెల్లూరు ఆధ్యాత్మిక, సుందర ప్రాంతంగా తయారవుతుందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కోటంరెడ్డి తెలియజేశారు. తెలుగుదేశం హయాంలో అమృత్ పథకం కింద 17.55 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ప్రభుత్వం మారడంతో నిలిచిపోయిన అభివృద్ధి పనుల సాధన కోసం తాము మూడేళ్లుగా పోరాడుతున్నామని తెలిపారు.

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో టెండర్లు పిలిచి ఆరు నెలలైనా పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదన్నారు. 15 రోజుల్లో పనులు ప్రారంభించకుంటే నుడా కార్యాలయాన్ని ముట్టడిస్తామని.. ప్రతి దేవస్థానానికి వెళ్లి భక్తుల సహాకారం కోరతామని ప్రకటించారు. ముస్లింల సహకారంతో చేసిన పోరాటం కారణంగానే దర్గా అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని.. ఇది అధికార పార్టీ పెద్దలకు నచ్చినట్టు లేదన్నారు. ఉద్యమాలతో సమస్యలు పరిష్కారం కావంటున్న అధికార పార్టీ నేతలు, రూరల్ సమస్యలపై బాధ్యత తీసుకోగలరా అని నిలదీశారు.

"ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ నిర్మాణం జరిగితే నెల్లూరు జిల్లాలోనే ఒక మంచి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటవుతుంది. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు జిల్లాకే ఒక మణిహారంలా చూడచక్కని, అందమైన వాతావరణం నెలకొంటుంది. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ నిర్మాణం కోసం గత తెలుగుదేశం హయాంలో రూపుదిద్దుకోవడం జరిగింది. పనులు జరిగినాయి. కానీ పూర్తికాకముందే.. ప్రభుత్వం మారింది. తరువాత వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పనులు అన్నీ ఆపేశారు.

ఈ పరిస్థితుల్లో ఆ పనులు ఆపేసిన తరువాత.. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి, ప్రభుత్వంలో ఉండే పెద్దలతో మాట్లాడి.. ఇవి కేంద్ర ప్రభుత్వ డబ్బు వేరే వాటికి వీటిని వాడే అవకాశం కూడా లేదు అని చెప్పాను. ఈ పనులు ఆపేయడం వలన నెల్లూరు జిల్లాకి ఒక మంచి ప్రాజెక్టు నష్టపోతున్నాం అని ఒప్పించాను. మూడు సంవత్సరాల ప్రయత్నం తరువాత రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. టెండర్లు కూడా పిలిచారు. 17 కోట్ల 55 లక్షలతో కేంద్ర ప్రభుత్వ అమృత్ నిధుల కింద టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు పూర్తై ఆరు నెలలు అయింది. కానీ ఇప్పటి వరకూ పని ప్రారంభించలేదు. ఇది అధికారుల నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నిస్తున్నాను. అందుకే 15 రోజులలో పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియతజేస్తున్నాను". - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే

15 రోజుల్లోగా పనులు ప్రారంభించాలి.. లేకుంటే..!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details