వైకాపా హయాంలో రౌడీ రాజ్యం నడుస్తోందని నెల్లూరు నగర తెదేపా అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మండిపడ్డారు. వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ లో తెదేపా నాయకులకు చెందిన 3 భవనాలను కూల్చివేశారని ఆరోపించారు. వాటిని చూసేందుకు వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేయటం ఏంటని ఆగ్రహించారు. రోజు రోజుకు తెదేపా నేతలపై, విలేకరులపై వైకాపా నేతల దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా కార్యకర్తలకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
వైకాపా దాడులకు తెదేపా భయపడదు: కోటంరెడ్డి - ycp
వైకాపా ప్రభుత్వ హయాంలో తెదేపా నేతలు, విలేకరులపై దాడులు జరుగుతున్నాయని నెల్లూరు నగర తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహించారు.
కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి