సీబీఎన్ ఆర్మీ నెల్లూరు నాయకుడు హజరత్ కుమార్‌పై మారణాయుధాలతో దాడి చేసిన వారిపై.. పోలీసులు బెయిలబుల్ కేసులు పెట్టడం దారుణమని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. తీవ్ర గాయాలతో హజరత్ సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాలకు ఆసుపత్రిలో చేరితే.. పోలీసులు నాలుగున్నరకే కేసు ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు.
'మారణాయుధాలతో దాడి చేస్తే... బెయిలబుల్ కేసులు పెడతారా?'
తెదేపా నేత హజరత్ కుమార్‌పై మారణాయుధాలతో దాడి చేస్తే పోలీసులు బెయిలబుల్ కేసులు పెట్టడమేంటని ఆ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు.
'మారణాయుధాలతో దాడిచేస్తే...బెయిలబుల్ కేసులు పెడతారా?'
తలపై ఏడు కుట్లు పడి చావు బతుకుల మధ్య ఉంటే బెయిలబుల్ కేసులు పెట్టడం ఎక్కడ న్యాయమన్నారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.