నెల్లూరులోని పొగతోటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి యజమాన్యం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని తెదేపా నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిర్వహకుడు సహా మరికొన్ని ఆస్పత్రులను సైతం లీజుకు తీసుకోని కరోనా బాధితుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నట్లు మండిపడ్డారు. ఈ క్రమంలో అర్హత లేని వైద్యులను నియమించుకుంటూ దోపిడీ దందాకు తెరలేపారన్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలతోనే ఇలా నకిలీ వైద్యులు రెచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'నకిలీ వైద్యులు : కొవిడ్ పేరిట ప్రజలను లూటీ చేస్తున్నారు' - నెల్లూరు జిల్లా ముఖ్యంశాలు
నెల్లూరులోని పొగతోటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి కొవిడ్ బాధితుల నుంచి పెద్ద మెుత్తంలో డబ్బులు వసూలు చేస్తోందని తెదేపా నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలతోనే ఈ అక్రమాలకు తెరలేపారని పేర్కొన్నారు.
'నకిలీ వైద్యులు : కొవిడ్ పేరిట ప్రజలను లూటీ చేస్తున్నారు'