ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Woman Sarpanch: కనీస గౌరవం ఇవ్వడం లేదు.. మహిళా సర్పంచ్​ ఆవేదన - mla varaprasad

నేను ఎస్టీ మహిళను కావడంతో.. సర్పంచిగా నాకు ఇవ్వాల్సి గౌరవం ఇవ్వడం లేదంటూ నెల్లూరు జిల్లా కోట సర్పంచ్ వెంకటరమణ తీవ్ర మనస్థాపం వ్యక్తం చేశారు. ఈఓ పీఆర్డీ స్వరూపారాణియే అన్ని పనులు చేస్తూ ఫొటోలకు మాత్రమే పిలుస్తున్నారని వాపోయారు.

kota-sarpanch-venkata-ramanamma-letter-to-mla-varaprasad
'ఎస్టీ సర్పంచినని.. ఫొటోలకు మాత్రమే పిలుస్తున్నరు'

By

Published : Dec 25, 2021, 1:52 PM IST

'ఎస్టీ సర్పంచినని.. ఫొటోలకు మాత్రమే పిలుస్తున్నరు'

నెల్లూరు జిల్లా కోట సర్పంచ్‌ వెంకటరమణ తీవ్ర మనస్థాపం చెందారు. ఎస్టీ మహిళ కావడంతో అధికారులు తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈఓ పీఆర్డీ స్వరూపారాణి చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పనుల గురించి కనీస సమాచారం ఇవ్వడం లేదన్నారు. అన్ని పనులు ఆమెనే చేసి తనను మాత్రం కేవలం ఫొటోల కోసం పిలుస్తున్నారని ఆవేదన చెందారు.

పంచాయతీ కార్యాలయంలో తనకు సరైన గది సైతం కేటాయించలేదని సర్పంచ్ వాపోయారు. దీంతో ఆమె గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details