ఆంధ్రప్రదేశ్ కైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులో గాలిపటాల పండుగ కోలాహలంగా సాగింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులో జరిగిన కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేశారు. వివిధ రూపాలు, ఆకారాల్లో ఉన్న గాలిపటాలు ఆకట్టుకున్నాయి.
kite festival: నెల్లూరులో కోలాహలంగా.. గాలిపటాల పండగ - నెల్లూరు వార్తలు
నెల్లూరులో గాలిపటాల పండుగ కోలాహలంగా నిర్వహించారు. నగరంలోని నెక్లెస్ రోడ్డులో జరిగిన కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేశారు.
![kite festival: నెల్లూరులో కోలాహలంగా.. గాలిపటాల పండగ kite festival in nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14202433-883-14202433-1642340476331.jpg)
kite festival in nellore
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గత మూడేళ్లుగా గాలిపటాల పండుగను ఈ అసోసియేషన్ నిర్వహిస్తోంది. కనుమరుగవుతున్న సంప్రదాయాలను పరిరక్షించేందుకు గాలిపటాల పండుగ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు గాలిపటాలు ఎగరేస్తూ ఉల్లాసంగా గడిపారు.
ఇదీ చదవండి:Prabhalu: కోనసీమలో వైభవంగా ప్రభల తీర్థం