Kavali police arrested more than 100 theft cases Accused: పద్నాలుగేళ్లుగా చోరీలే వృత్తిగా ఎంచుకొని.. ఇప్పటివరకు ఆరు జిల్లాల్లో వందకుపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని నెల్లూరు జిల్లా కావలి పోలీసుల అరెస్టు చేశారు. నిందితుడికి సంబంధించిన వివరాలను కావలి డీఎస్పీ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
విశాఖ నగరంలోని గాజువాకకు చెందిన బోలా నాగసాయి(30)ని కావలి గ్రామీణ సీఐ షేక్ ఖాజావలి అరెస్టు చేశారు. ముసునూరు వద్ద ఉన్నాడన్న పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 184 గామ్రుల బంగారం, 315 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. నగదు అతను విలాసాలకు వినియోగించాడు.