నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం, సమీపంలోని గ్రామాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. కావలి పట్టణ సమీపంలోని ముసునూరులో ఓ ఇంట్లో ఎవరు లేని సమయం చూసి... తాళం పగలగొట్టి 10 సవర్ల బంగారం, కేజీ వెండి, సుమారు రూ.3లక్షల విలువైన వస్తువులు దోచుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు... జిల్లాలోని కోవూరుపల్లి గ్రామానికి చెందిన మన్నేపల్లి శ్రీనివాసులును అరెస్టు చేశారు. అతని నుంచి దొంగిలించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.
తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా... దొంగతనాలు - thief gets arrest at kavali latest news
నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం, సమీప గ్రామాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. కావలి సమీపంలోని ముసునూరులో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఓ దొంగ బంగారం దోచుకెళ్లాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాద్
TAGGED:
thief gets arrest at nellore