కార్తిక పూర్ణిమ సందర్భంగా నెల్లూరు జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే ప్రజలు శివయ్య దర్శనానికి బారులు తీరారు. ఆలయ ప్రాంగణాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయగిరి, కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట, కొత్త సత్రం సముద్ర తీరాల్లో ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. మూలస్థానేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
కార్తిక పౌర్ణమి సందడి.. రద్దీగా శివాలయాలు
కార్తిక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో శివాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ పెరిగింది.
రద్దీగా మారిన శివాలయాలు