ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో లాక్​డౌన్... రోగులకు తీవ్ర అవస్థలు - కరోనా న్యూస్ నెల్లూరు జిల్లా

కరోనా వ్యాప్తి కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా లాక్ డౌన్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆసుపత్రులు మూసి ఉన్న కారణంగా.. రోగులు అవస్థలు పడుతున్నారు.

Karona_Lock_Down
జిల్లాలో లాక్​డౌన్... అవస్థలు పడుతోన్న రోగులు

By

Published : Mar 25, 2020, 6:56 PM IST

జిల్లాలో లాక్​డౌన్... అవస్థలు పడుతోన్న రోగులు

కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో నెల్లూరు జిల్లా నిర్మానుష్యంగా మారింది. నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు... రాకపోకలను అడ్డుకుంటున్నారు. నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వాణిజ్య సముదాయాలు పూర్తిస్థాయిలో మూతపడ్డాయి. ప్రధాన ఆసుపత్రులు తప్ప మిగిలినవన్నీ మూతపడ్డాయి. రోగులకు అవస్థలు తప్పడం లేదు.

కొంతమంది వైద్యులు రాసిన మందులు వారి హాస్పిటల్స్ లోనే దొరికే అవకాశం ఉండటం, అవి బయట దొరకని పరిస్తితుల్లో ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, పలువురు యువకులు ఏ దిక్కు లేని వారికి ఆహారం పొట్లాలు అందిస్తూ ఆదుకుంటున్నారు. పెళ్ళకూరు మండలం రోసనూరులోకి ఇతర గ్రామస్థులు రాకుండా రోడ్డును దిగ్భంధం చేశారు. బయట వ్యక్తులు ఎవరూ కరోనా సమస్య పరిష్కారం అయ్యేంత గ్రామంలోకి రావద్దని పోస్టర్లు అంటించారు. చుట్టూ కంపలు వేసి దారులు మూసేశారు.

ABOUT THE AUTHOR

...view details