నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెరుబొట్లపల్లిలో భారీగా కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గ్రామంలో రహస్యంగా దాచి ఉంచిన కర్ణాటక మద్యంతో పాటు గుట్కాలు ,హాన్స్ బస్తాలు,ప్లేయింగ్ కార్డ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు వచ్చిన సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మీ , అడిషనల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలసి సుమారు 50 బాక్సుల్లో ఉన్న మద్యాన్ని పట్టుకున్నారు.
మరింత సరుకు ఉందన్న సమాచారం మేరకు.. గ్రామంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యాపారస్తుడిని అదుపులోకి తీసుకుని సుమారు రూ.15 లక్షల విలువచేసే సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.