నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట కనుపర్తిపాడు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. భూ వ్యవహారంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. స్టేషన్ ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా దళిత రైతులు నినాదాలు చేశారు.
నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట.. గ్రామస్థుల ఆందోళన - నెల్లూరు జిల్లా ముఖ్యంశాలు
నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట కనుపర్తిపాడు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. భూ వ్యవహారంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ స్టేషన్ ఎదుట బైఠాయించారు.
![నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట.. గ్రామస్థుల ఆందోళన నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట కనుపర్తిపాడు గ్రామస్థుల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13486821-882-13486821-1635438922605.jpg)
నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట కనుపర్తిపాడు గ్రామస్థుల ఆందోళన
తాము సాగు చేసుకుంటున్న పొలాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా.. తాను నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసిన పొలం వద్దకు వెళితే స్థానికులు అడ్డుకుంటున్నారని దివ్య అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు కొంతమందిని స్టేషన్‌కు తీసుకురావడంతో.. గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఇరు పక్షాల వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రూరల్ డిఎస్పీ హరనాథ్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: