ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కండలేరు ముంపు ప్రాంత నిరుద్యోగుల నిరసన - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

నెల్లూరు జిల్లా కండలేరు ముంపు ప్రాంత నిరుద్యోగులు నిరసనకు దిగారు. 13 ఏళ్ల కిందట ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. ఇప్పటిదాకా ప్రక్రియ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదని తెలిపారు. వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేసి ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Kandaleru unemployed people protest
కండలేరు ముంపు ప్రాంత నిరుద్యోగల నిరసన

By

Published : Dec 14, 2020, 4:35 PM IST

నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట కండలేరు ముంపు ప్రాంత నిరుద్యోగులు నిరసన చేపట్టారు. తమకు 13 ఏళ్ల కిందట ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ ఇప్పటి వరకూ అది కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సుమారు 2,500 మంది దరఖాస్తు చేసుకుంటే కనీసం అర్హులను కూడా ఇప్పటిదాకా గుర్తించలేదని వాపోయారు. వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేసి ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదని తెలిపారు. ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న తమకు ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి: 'వైకాపా నేత మా భూమిని కబ్జా చేయించాడు'

ABOUT THE AUTHOR

...view details