ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి పంచాయితీ వీడుదాం... కామధేను కేంద్రాన్ని కాపాడుకుందాం - నెల్లూరు జిల్లా చింతలదేవి క్షేత్రం

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రానికి నీటి ఎద్దడి పొంచి ఉంది. స్వదేశీ జాతి పశువులు అభివృద్ధి చేసి రైతులకు అందించే లక్ష్యంతో నడుస్తోందీ కేంద్రం. మెట్ట ప్రాంతంలో ఉండటం వల్ల తాగునీరు సమస్యగా మారింది. గడ్డి పెంపకం ప్రశ్నార్థకమైంది. అపోహలు తొలగించి... నీటి సమస్యను తీర్చాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు.

నీటి పంచాయితీ వీడుదాం... కామధేను కేంద్రాన్ని కాపాడుకుందాం...

By

Published : Jun 29, 2019, 11:57 PM IST

నీటి పంచాయితీ వీడుదాం... కామధేను కేంద్రాన్ని కాపాడుకుందాం...

నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని చింతలదేవి క్షేత్రంలో జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రాన్ని 2013లో వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 250 కోట్లు నిధులు మంజూరు చేశారు. తొలివిడత 25 కోట్లు నిధులు మంజూరుకాగా.. 20కోట్లు ఖర్చయ్యాయి. నీటి సమస్య ఉందని ముందే గ్రహించిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం... సోమశిల జలాలు ఇచ్చేందుకు అంగీకరించింది.

ఉప్పుటేరు వాగు నుంచి రాళ్లపాడు జలాశయానికి ఉత్తర కాలువ ద్వారా నీళ్లు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టుకు వెళ్లే 1.5 టీఎంసీల నీటిలో 7.884ఎంసీఈఎఫ్‌టీ అంటే సుమారు 50 ఎకరాలకు సరిపడా నీటిని పశువులకు అందివ్వాలని జీవో విడుదల చేశారు. ప్రస్తుతం పైప్ లైన్లు మేర పనులు జరిగాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రాళ్లపాడుప్రోజెక్టుపై ప్రకాశంజిల్లా రైతులతో సమావేశమై ఈ నీటి మళ్లింపు పనులు నిలిపివేయాలని ధర్నా చేశారు. దీంతో పనులు కాస్త నిలిచిపోయాయి.

నానాటికీ అడుగంటిపోతున్న నీటిమట్టాలతో ఇక్కడ నీటి ఎద్దడి ఏర్పడింది. బోర్ల ద్వారా వచ్చే నీళ్లు కేవలం పశువుల అవసరాలకే సరిపోతున్నాయి. గడ్డి పెంచేందుకు వీల్లేకుండా పోయింది. స్థానిక రైతులే గడ్డి పెంచి క్షేత్రానికి ఇస్తున్నారు. 100 ఎకరాల భూమిలో గడ్డి పెంచితే కానీ ఇక్కడ పశువులకు సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ఇరు ప్రాంతాల నాయకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. ఆగిపోయిన పైపులైన్ల పనులు పునురద్ధరించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details