రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలంలోనే తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని.. నెల్లూరు జిల్లా కాకుపల్లిలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కాకుపల్లి బిట్-1 ప్రాంతంలో ముత్తుకూరు కాలువ పక్కనే ఉన్న ఇరిగేషన్ స్థలంలో ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోడ నిర్మించారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు.. ఎన్నో ఏళ్లుగా తాము వినియోగించుకుంటున్న ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోడ ఎలా కడతారంటూ నిరసన వ్యక్తం చేశారు.
ఆ స్థలంలోనే గుడిసెలు వేసి.. తమకు అక్కడే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎమ్మార్వో నాజర్, సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులతో మాట్లాడారు. ఇరిగేషన్ స్థలంలో ఎవరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదనీ... రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్మించిన గోడను తొలగిస్తామని హామీ ఇచ్చారు.