ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్​కు శంకుస్థాపన - నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్

నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల ఎన్నో ఏళ్ల ఫిషింగ్ హార్బర్ కల ఎట్టకేలకు సాకారమైంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.

juvvaladinne fishing Harbor lin Nellore District
నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన

By

Published : Nov 21, 2020, 7:33 PM IST

నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన శిలాఫలకాన్నిముఖ్యమంత్రి జగన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, అధికారులు, మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. జిల్లాలో రూ. 1933 కోట్ల మత్స్య సంపద వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని కలెక్టర్ చక్రధర బాబు తెలిపారు. ఈ హార్బర్ ఏర్పడితే అది మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఆక్వా హబ్​లు, జనతా బజార్​లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి చేశామని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details