నెల్లూరు ప్రభుత్వ వైద్య విద్యార్థులు, రెడ్ క్రాస్ సంస్థల మధ్య వివాదం నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రి స్థలాన్ని రెడ్ క్రాస్ ఆక్రమిస్తోందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే క్యాన్సర్ హాస్పిటల్ సుమారు ఐదెకరాల స్థలాన్ని ఆక్రమించి గోడ కడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆ గోడ కూలిపోతే...ఆ నిందలు మాపై మోపడం సరికాదన్నారు. వ్యాపార దృక్పథంతోనే రెడ్ క్రాస్ సంస్థ ప్రస్తుతం మెడికల్ కాలేజీకి అవసరమైన భవనాలు నిర్మించడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని కోరారు.
వైద్య విద్యార్థులు, రెడ్ క్రాస్ సంస్థ మధ్య వివాదం - red cross and junior doctors at nellore
ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో రెడ్ క్రాస్ సంస్థ అక్రమ కట్టడాలు చేస్తుందని నెల్లూరు ప్రభుత్వ వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్‌ను అభివృద్ధి చేయకుండా తమ స్థలాన్ని ఆక్రమిస్తోందని విద్యార్థులు అంటున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వైద్య విద్యార్థుల ఆందోళన
Last Updated : Jul 2, 2019, 10:31 AM IST