Press Academy Chairman Kommineni : ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు.. నెల్లూరు జిల్లా కందుకూరులో విలేకరులు చుక్కలు చూపించారు. కొవిడ్‌తో మృతి చెందిన విలేకరుల కుటుంబాలను ఆదుకున్నారా అని నిలదీశారు. కందుకూరులో ఇటీవల తెలుగుదేశం ర్యాలీలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని.. కొమ్మినేని పరిశీలించారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రస్తావన చేస్తున్న కొమ్మినేనిని మీడియా ప్రతినిధులు అడ్డుకున్నారు. మీరు ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గానే వచ్చారా..? లేక రాజకీయ నాయకుడిగా వచ్చారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా జర్నలిస్టులకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. విలేకరుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన కొమ్మినేని.. నేను చేతగాని వాణ్నే అంటూ వెళ్లిపోయారు.
ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌పై ప్రశ్నల వర్షం.. చేతగాని వాణ్నే అంటూ..! - ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేనికి నిరసన
KOMMINENI SRINIVASA RAO : ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు నెల్లూరులో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల కందుకూరులో టీడీపీ సభలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆయనపై విలేకరులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రశ్నలతో విసుగు చెందిన కొమ్మినేని తనకు చేత కాదంటూ వెళ్లిపోయారు.
KOMMINENI SRINIVASA RAO
Last Updated : Jan 6, 2023, 8:17 PM IST