ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి'

నెల్లూరు జిల్లాలో కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రభాకర్​రెడ్డి సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారంతా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.

joint Collector Prabhakar Reddy
సంయుక్త కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి

By

Published : Apr 7, 2021, 1:30 PM IST

నెల్లూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రభాకర్​రెడ్డి సూచించారు. అనుమానం ఉన్న వారందరూ పరీక్షలు చేయించుకోవాలని.. కొవిడ్​ కేర్ సెంటర్లలో వైద్య సహాయం తీసుకోవాలని కోరారు. మరణాలు తగ్గించాలంటే ప్రజలు సహకరించాలని అన్నారు. అందరూ మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని, నెల్లూరు జీజీహెచ్ , నారాయణ ఆసుపత్రుల్లో కొవిడ్ కేంద్రాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details