'పోర్టు కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి' - నెల్లూరులో భారీ ర్యాలీ వార్తలు
కృష్ణపట్నం పోర్టులో కార్మికుల ఐక్యత వర్థిల్లాలని...నెల్లూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
'పోర్టు కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి'
కృష్ణపట్నం పోర్టు కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని...ఉపాధి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ...సీఐటీయూ ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. . తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోర్టులో కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరారు. చలో కలెక్టరేట్ నినాదంతో తరలివచ్చారు.