ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాస్కులు లేకుండా బయటకు వస్తే జరిమానా' - తాజా కొవిడ్ కేసులు

కరోనా కేసులు పెరుగుతున్నందున నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు నెల్లూరు అదనపు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. మాస్కులు లేకుండా బయటకు వస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

awareness on coronavirus
కొవిడ్ నిబంధనలు

By

Published : Mar 23, 2021, 5:27 PM IST

రోజు రోజుకూ కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి.. ప్రజలను కోరారు. ఈ మేరకు నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. కొవిడ్ బారిన పడకుండా స్వీయ నియంత్రణ జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్కులు లేకుండా బయటకు వస్తే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం జిల్లాలో రోజకూ 20కిపైగా కేసు నమోదు అవుతున్నాయని.. అయితే అవన్నీ బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లల్లో గుర్తించినట్లు చెప్పారు. క్షయ వ్యాధి నియంత్రణ దినోత్సవం బుధవారం నిర్వహిస్తున్నట్లు జేసీ తెలిపారు. నెల్లూరును క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details