ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MINISTER MEKAPATI GOUTHAMREDDY: ఏపీతో కలిసి పనిచేసేందుకు జపాన్‌ ఆసక్తి..

రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డిని జపాన్ ప్రతినిధులు కలిశారు. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు జపాన్‌ బృందం వెల్లడించింది.

japanese-delegation-meets-minister-mekapati
ఏపీతో కలిసి పనిచేసేందుకు జపాన్‌ ఆసక్తి

By

Published : Nov 7, 2021, 8:25 AM IST

రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో జపాన్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. శనివారం రాత్రి నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గౌతంరెడ్డిని కలిసి పెట్టుబడులు, ఐటీ పార్కులు, సెజ్‌లు, టెక్నాలజీ, నైపుణ్య శిక్షణ, తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు జపాన్‌ బృందం వెల్లడించింది. ప్రభుత్వం ఐటీ, పరిశ్రమలు, నైపుణ్య రంగాల్లో తీసుకొస్తున్న వినూత్న సంస్కరణలు, యువతకు ఉపాధి పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న చర్యలను మంత్రి గౌతంరెడ్డి వివరించారు.

సోమవారం మరోసారి భేటీ అయిన తర్వాత ఆయా అంశాలపై ముందుకెళతామని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో టెక్‌ గెంట్సియా సీఈవో జాయ్‌ సెబాస్టియన్‌, మార్కెటింగ్‌, సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డెనిస్‌ యూజిన్‌ అరకల్‌, బ్లూ ఓషియన్‌ బిజినెస్‌ ఫెసిలిటేషన్‌ సర్వీసెస్‌ ఛైర్మన్‌ బెన్సిజార్జ్‌, హిడేహరు హ్యొడో కె.కరుణానిధి, నందకిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:Maha Padayatra:వెల్లువెత్తిన ప్రజామద్దతు..పాదయాత్రలో ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details