నిర్మానుష్యంగా నెల్లూరు నగరం కరోనా వ్యాధి నివారణకు సామాజిక దూరం పాటించి... ఇళ్లకే పరిమితం అవ్వాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. నెల్లూరులో ఉదయం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లైన మద్రాస్ బస్టాండ్ ,ఆర్టీసీ బస్టాండ్, వీఆర్ పెట్రోల్ బంకు, కొండాయపాలెం గేట్ తదితర సెంటర్లలో రహదారులు జనాలు లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఉదయగిరిలో...
జనతా కర్ఫ్యూతో నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి బోసిపోయింది. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఉదయగిరి ప్రజలు కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు, రహదారులు, బస్టాండ్ ప్రాంగణాలు జనసంచారం లేక వెలవెలబోతూ దర్శనమిచ్చాయి. దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి.
వెంకటగిరిలో...
వెంకటగిరి ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. ఉదయం నుంచే ప్రజలెవరూ ఇళ్లను వదిలి బయటకు రావటం లేదు. దీంతో ప్రధాన రహదారులన్నీ బోసిపోయాయి. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. గ్రామాల్లో సైతం ముందస్తుగా శనివారమే జనతా కర్ఫ్యూపై ప్రచారం నిర్వహించటంతో ప్రజలు వీధుల్లోకి రాకుండా బాధ్యత వహిస్తున్నారు.
ఆత్మకూరులో...
ఖాళీగా దర్శనమిస్తున్న ఆత్మకూరు రహదారులు ఆత్మకూరులో జనతా కర్ఫ్యూకు మద్దతుగా వ్యాపారస్తులంతా షాపులు మూసివేశారు. వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యారు. ప్రధాన రహదారులు వాహన రాకపోకలు లేక ఖాళీగా దర్శమిస్తున్నాయి. ఓ ఇంట్లో జరుగుతున్న శుభకార్యంలో సైతం బంధువులు లేక వేదిక బోసిపోయింది.
జన సంచారం లేని గూడూరు రహదారులు ఇదీ చదవండి:
జనతా కర్ఫ్యూకు సపోర్టు.. ఆదివారం జరగాల్సిన పెళ్లి వాయిదా