రాష్ట్రంలోని ఆలయాల ఆస్తులు పరిరక్షించాలంటూ నెల్లూరులో జనసేన ఉపవాస దీక్ష చేపట్టింది. భౌతిక దూరం పాటిస్తూ నగరంలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు ఈ దీక్ష చేశారు. తిరుమల ఆలయ భూములు అమ్మాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి ఉపసంహరించుకోవడం శుభ పరిణామమని జనసేన నేత కిశోర్ అన్నారు. భవిష్యత్తులోనూ శ్రీవారి ఆస్తులతోపాటు ఇతర దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
'ఆలయాల ఆస్తులు పరిరక్షించాలి' - నెల్లూరులో జనసేన నేతల ధర్నా
రాష్ట్రంలోని ఆలయాల ఆస్తులు పరిరక్షించాలంటూ నెల్లూరులో జనసేన ఉపవాస దీక్ష చేపట్టింది. భవిష్యత్తులో శ్రీవారి ఆస్తులతోపాటు ఇతర దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

నెల్లూరులో జనసేన నేతల దీక్ష