ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంత్రి అనిల్ చెప్పినట్టే.. నీటి పారుదల శాఖ అధికారులు పని చేస్తున్నారు' - jansena latest news

సర్వేపల్లి కాలువ పనుల్లో భారీగా అవినీతి జరుగుతోందని జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అనిల్​ కు ఈ అవినీతితో సంబంధం ఉందని అన్నారు.

sarvepalli canal
సర్వేపల్లి కాలువ పనులు

By

Published : Jul 4, 2021, 6:03 PM IST

అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్రానికి జలవనరుల శాఖా మంత్రా?? లేక సర్వేపల్లి కాలవకు మంత్రో... అర్థం కావట్లేదని జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులో జరుగుతున్న సర్వేపల్లి కాలువ పనుల్లో భారీగా అవినీతి జరుగుతుందని ఆయన ఆరోపించారు.

కాలువ పనుల్లో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ కెనాల్​ వద్ద జనసేన పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. మంత్రి అనిల్ చెప్పినట్లుగా నీటి పారుదల శాఖ అధికారులు పని చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్.. ఈ కాలువ పనులపై దృష్టి సారించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details