నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 5వ వార్డు నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి అన్నవరపు శ్రీనివాసులు.. తన నామినేషన్ గల్లతైందని కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ వార్డులో వైకాపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి ముగ్గురు పోటీ చేశారు. వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక తెదేపా అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాడు. మూడో తేదీన జరిగిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో తన ప్రమేయం లేకుండానే.. నామినేషన్ విత్ డ్రా అయినట్లు ఫిర్యాదులో శ్రీనివాస్ పేర్కొన్నాడు. దీంతో వైకాపా అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటించారని వాపోయాడు. బంధువుల గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేలోగా.. ఇలా జరిగిందని చెప్పారు.
జనసేన అభ్యర్థి నామినేషన్ గల్లంతు.. మున్సిపల్ కమిషనర్‌కి ఫిర్యాదు - municipal elections in athmakuru news
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని ఐదవ వార్డులో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి అన్నవరపు శ్రీనివాసులు.. తన నామినేషన్ గల్లంతైదని కమిషనర్‌కి ఫిర్యాదు చేశాడు. పోటీలో ఎవరూ లేకపోవటంతో వైకాపా అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటించారన్నారు.

మున్సిపల్ కమిషనర్