ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jagan photo రసాభాసగా నెల్లూరు కార్పొరేషన్ సమావేశం.. వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మేయర్

By

Published : Apr 24, 2023, 8:07 PM IST

corporation meeting: నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభసగా మారింది. మేయర్ సీటు వెనకాల గోడకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫొటో పై చెలరేగిన వివాదంపై.. మేయర్, వైసీపీ కార్పొరేటర్ల మద్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. మేయర్ తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని మేయర్ ప్రకటించినా, పరిస్థితి అదుపులోకి రాలేదు. సమావేశం అనంతరం మేయర్ కౌన్సల్ మీటింగ్​లో తనపై జరిగిన దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నెల్లూరు నగర సర్వసభ్య సమావేశం
corporation meeting

Nellore corporation meeting: నెల్లూరు నగర సర్వసభ్య సమావేశం రసాభసగా మారింది. మేయర్ సీటు వెనకాల గోడకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫొటో పెట్టడంపై... ఎవరు ఫొటో పెట్టారు అని నగర మేయర్ అడగడంతో గొడవ మొదలైంది. వైసీపీ కార్పొరేటర్లు అందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మేయర్ వ్యాఖ్యలకు వ్యతిరేకం గా కార్పొరేటర్లు ధర్నా చేశారు.

నెల్లూరు కార్పొరేషన్ సమావేశం గందర గోళంగా మారింది. సమావేశ మందిరంలోకి బయట వ్యక్తులు కొందరు చొచ్చుకు వచారు. సర్వసభ్య సమావేశంలో చర్చ జరుగుతుండగా.. మేయర్ వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. సీఎం జగన్ ఫొటో ఎవరు పెట్టారు అని అడిగిన మేయర్ స్రవంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బి ఫార్మ్ పై గెలిచిందని గుర్తుచేశారు. మేయర్ ఇప్పుడు ఆ విషయాన్ని మరిచి పోయిందని విమర్శించారు. వెంటనే మేయర్ పదవి కి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గానికి అనుకులంగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మేయర్ సభను వాయిదా వేసి ఛాంబర్ లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. మేయర్ ను వెళ్లనీయకుండా వైసీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఇదే సమయంలో బయట నుండి రూరల్ ఎమ్మెల్యే అనుచరులు కొందరు సమావేశ మందిరంలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కౌన్సిల్ సమావేశం లో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. గొడవతో మేయర్ మనస్థాపం చెందింది. కన్నీరు పెట్టుకుంది.

గంటపాటు వాయిదా: దాదాపు గంటపాటు సమావేశం వాయిదా అనంతరం తిరిగి కౌన్సిల్కొచ్చిన మేయర్ తన మాటలకు వెనక్కి తీసుకుంటున్నానని మేయర్ ప్రకటింతచడంతో వివాదం సర్దుమనిగింది. తాను చెప్పే మాటలు కూడా వినకుండా రాజకీయ కుట్రలో భాగంగా గిరిజన మహిళనైన తనను అవమానించేలా చీర లాగి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాస యాదవ్, మొయిళ్ళ గౌరీ, మూలే విజయభాస్కర్ రెడ్డి లు తనతో అమార్యాదగా ప్రవర్తించారని ఆరోపించారు. తనకు జరిగిన అవమానంపై కేసు నమోదు చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కోర్టునైనా ఆశ్రయిస్తామని ప్రకటించారు. తాము ఏమీ అవమానించాము రుజువు చేయాలని కార్పొరేటర్లు మరోసారి ప్రశ్నించడంతో మరల సమావేశం గందరగోళంగా మారింది.

కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం మేయర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాస యాదవ్, మొయిళ్ళ గౌరీ, మూలే విజయభాస్కర్ రెడ్డిలు తనతో అమార్యాదగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు చేశారు. కౌన్సిల్ లో ప్రజా సమస్యలు చర్చించకుండా, తనను అవమానించేలా ఓ వర్గం ప్రయత్నిస్తోందని మేయర్ ఆరోపించారు. తనకు జరిగిన అవమానంపై కోర్టును ఆశ్రయిస్తాని తెలిపారు. ఇదే అంశంపై రాష్ట్రపతికి, ఎస్టీ కమిషన్ కు లేఖల ద్వారా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి చిత్రపటం కౌన్సిల్ హాల్ లో పెట్టడాన్ని తాను వ్యతిరేకించలేదని, తాను చెప్పేది కూడా వినకుండా సమావేశంలో గందరగోళం సృష్టించడంతో, వాయిదా వేసి వెలుతున్న తనతో అమర్యాదగా ప్రవర్తించారని చెప్పారు.

నాలుగో పట్టణ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన మేయర్‌ పొట్లూరి స్రవంతి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details