ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రైవేట్​ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలి' - private teachers at nellore district news update

నెల్లూరులో ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ.. ప్రైవేటు ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

JAC round table meeting
జేఏసీ రౌండ్​ టేబుల్​ సమావేశం

By

Published : Jul 16, 2020, 6:57 PM IST

ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని నెల్లూరులో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదిత్య కళాశాలలో ప్రైవేటు ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

జీతాలు ఇచ్చారో లేదో తెలపాలని జిల్లా విద్యా శాఖ అధికారులు యాజమాన్యాలను కోరినా, వారు సరైన సమాధానం చెప్పకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం కల్పించుకొని ప్రైవేటు ఉపాధ్యాయులకు నెలకు పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి, ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాయి తోపాటు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details