నెల్లూరులో "మేకపాటి" విజయోత్సవ ర్యాలీ - it minister
వైకాపాలో విజయోత్సాహం కొనసాగుతోంది. రాష్ట్ర ఐటీ, వాణిజ్య, పరశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది.
నెల్లూరులో "మేకపాటి" విజయోత్సవ ర్యాలీ
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. శంకరనగరం నుంచి మెుదలైన ర్యాలీ ప్రధాన గ్రామాల మీదుగా కొనసాగింది. పల్లెపల్లెలో గౌతం రెడ్డికి హారతలిచ్చి ఘన స్వాగతం పలికారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.