ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు- నేడు పనులు పరిశీలించిన మంత్రి గౌతమ్ రెడ్డి‌ - gowtham reddy paryatana

నెల్లూరు జిల్లాలోని గండ్లవేడు గ్రామంలో ఐటి శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి‌ పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు.

gowtham reddy visit in nellore district
నాడు- నేడు పనులు పరిశీలించిన మంత్రి గౌతమ్ రెడ్డి‌

By

Published : Feb 27, 2021, 8:04 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గండ్లవేడు గ్రామంలో ఐటి శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి‌ పర్యటించారు. గ్రామంలో వైకాపా బలపరచిన అభ్యర్థి సర్పంచ్ గా గెలుపోందడంతో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న.. నాడు-నేడు పనులను పరిశీలించారు. అక్కడ పనుల గురించి ఉపాధ్యాయులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న మంత్రి.. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలని, ఎన్నికల తరువాత ఎటువంటి వివాదాలు ‌లేకుండా అందరూ కలిసిమెలిసి గ్రామాభివృద్ధి కోసం పనిచేయాలని ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details